ETV Bharat / state

'నియోజకవర్గాన్ని సమస్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం' - తిరుమలగిరి

సూర్యాపేట జిల్లాలోని నాగారం, తిరుమలగిరి మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్​ పనులను వెంటనే పూర్తి చేయాలంటూ వారిని ఆదేశించారు.

mla Gaadhari Kishore ordered officers to complete the pending tasks immediately in thungaturthi constituency
'నియోజకవర్గాన్ని సమస్య రహితంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం'
author img

By

Published : Mar 8, 2021, 5:13 PM IST

నియోజకవర్గాన్ని సమస్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్. సూర్యాపేట జిల్లాలోని నాగారం, తిరుమలగిరి మండలాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల అధికాలతో చర్చించారు. పెండింగ్​ పనులను వెంటనే పూర్తి చేయాలని వారిని ఆదేశించారు.

గతంతో పోలిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజక్ట్​తో చెరువులన్ని నిండు కుండలను తలపిస్తున్నాయని వివరించారు. సమస్యలను ఎప్పటికప్పుడు.. మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

నాగారం మండలంలో ప్రభుత్వ కార్యకలాపాలు.. అద్దె భవనాల్లో జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే. వీలైనంత త్వరలో.. నూతన భవనాలు నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, మండలాధికారులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మహిళలు రాణించడానికి కాంగ్రెస్​ విధానాలే కారణం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.