సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సుమారు 500 మందికి మాస్కులు, నిత్యావసర సరకులు అందజేశారు. కొవిడ్-19 బారిన పడకుండా గ్రామస్థులకు జాగ్రత్తలు వివరించారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కవిత, సర్పంచ్ అనుసుయమ్మ, తదితరులు పాల్గొన్నారు.