సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. ఫలితంగా తాగు నీరు వృథాగా పోయింది. రహదారి జలమయమై... రాకపోకలకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గతంలోనూ పైప్ లీకైందని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్ కోతలు