ETV Bharat / state

మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​... పట్టించుకోని అధికారులు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గానుగుబండ క్రాస్ రోడ్ వద్ద మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకై నెల రోజులుగా నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​... పట్టించుకోని అధికారులు
author img

By

Published : Aug 27, 2019, 4:39 AM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మద్దిరాలకు వెళ్లే రహదారిలో గానుగుబండ క్రాస్ రోడ్ వద్ద మిషన్​ భగీరథ పైప్​లైన్​ నెల రోజులుగా లీకై నీరు వృథాగా పోతోంది. ఫలితంగా పరిసర ప్రాంతంలో పెద్ద మడుగు ఏర్పడి అందులో పశువులు స్నానాలు చేస్తూ సేద తీరుతున్నాయి. భారీగా నీరు వృథాగా పోతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా విషయంలో స్థానికంగా తుంగతుర్తి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి లీకేజీల వల్ల మురికి నీరు సరఫరా అవుతూ ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వాపోయారు. వెంటనే పైప్​లైనుకు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.

మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​... పట్టించుకోని అధికారులు

ఇదీ చూడండి : 'వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం

Intro:TG_ADB_11_26_ZP SARVA SABHYA SAMAVESHAM_AV_TS10032

Body:మంచిర్యాల జిల్లా మొదటి సర్వసభ్య సమావేశం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరైనారు. సభ్యులు మండలాల్లోని నెలకొన్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో జిల్లాలో నెలకొన్న సమస్యలపై సమావేశంలో 42 శాఖల అధికారులతో సుదీర్ఘ చర్చ కొనసాగించారు. గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య నెలకొందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన సమయానికి వైద్యులు నర్సులు ఉండటం లేదని జడ్పిటిసి సభ్యులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి భీష్మ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే దివ్యాంగుల నిర్ధారణ పరీక్షల లో చాలావరకు అర్హతలేని రావడంతో దివ్యాంగులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని సభ్యులు తెలపడంతో ఇలాంటి సమస్యలు మరోసారి పునరావృతం కావద్దని మంత్రి కలెక్టర్కు ఆదేశించారు. డిప్యూటేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను వెంటనే యథాస్థానానికి వినిపించాలని కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని వారికి అధికారులు పూర్తిగా సహకరించాలని మంత్రి పేర్కొన్నారు .

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.