సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు సొంత నిధులతో ప్రతి ఉదయం అల్పాహారం అందిస్తానని మంత్రి ప్రకటించారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారులు... పోలీస్ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో శారీరక, రాత పరీక్ష కోసం శిక్షణ ఇవ్వనున్నారు. షాట్ ఫుట్ వేసి మంత్రి సందడి చేశారు. శిక్షణ కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతీయువకులపట్ల మంత్రి జగదీశ్ రెడ్డి ఔదార్యం ప్రదర్శించారు. ప్రతి రోజు సొంత నిధులతో అల్పాహారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: ఈ నెల 21లోపు గాంధీలో నాన్ కొవిడ్ సేవల ప్రారంభం