కాంక్రీట్ రహదారుల వల్ల ఏర్పడుతున్న అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్ తరాలను కాపాడుకునేందు అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. పెరిగిన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో తృప్తిని ఇచ్చిన పథకం ఆసరా అని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి :కేసీఆర్ పర్యటన కోసం హరీశ్ పర్యవేక్షణ