సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు అండగా ఉంటామన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్-1 స్థాయి అధికారిణిగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్... నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యుల కోరిక మేరకు హైదరాబాద్‌లోనే ఇంటి స్థలం కేటాయించిట్లు పేర్కొన్నారు.
సూర్యాపేటలో కర్నల్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విగ్రహం ఏర్పాటు చేశాక సంతోష్‌బాబు కూడలిగా నామకరణం చేస్తామన్నారు. అతి త్వరలోనే కర్నల్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్