సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవేంద్రరావులో గ్రామ పంచాయతీ వీధి దీపాలు వెలిగిస్తుండగా వెముల సాయికుమార్ (21) అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాయికుమార్ గత రెండేళ్లుగా ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజులాగే వీధి దీపాలు వెలిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో స్పృహ కోల్పోయాడు.
చికిత్స కోసం తిరుమలగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అతని మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: నన్ను హిజ్రాాగా మార్చారు.. ఆత్మహత్య చేసుకుంటున్నా..!