సూర్యాపేట నుంచి తిరులమలగిరికి వస్తున్న లారీ.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వీధి స్తంభానికి ఢీకొట్టింది. అతివేగంగా ముందుకు వెళ్లి పక్కనే ఉన్న ఓ వర్క్ షాపు ముందున్న ద్విచక్రవాహనాన్ని, కారును ఢీ కొని ఆగిపోయింది. అప్పటి వరకు వర్క్ షాపులో పనిచేసిన పనివారు ఇంటికి వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనం, కారు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కారు యజమాని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. డానియల్ తెలిపారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్