ETV Bharat / politics

'యూనివర్సిటీలపై గౌరవం తగ్గింది - సరిదిద్దే బాధ్యత మీదే' - CM REVANTH ABOUT UNIVERSITIES

నూతన వైస్‌ ఛాన్సలర్లతో సీఎం రేవంత్​ భేటీ - కొంతకాలంగా యూనివర్సిటీలపై విశ్వాసం తగ్గుతోందన్న ముఖ్యమంత్రి - వర్సిటీల గౌరవాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశం - వర్సిటీల్లో వ్యవస్థల పునరుద్ధరణకు అధ్యయనం చేయాలని సూచన

CM REVANTH MEETING WITH VCS
CM Revanth Reddy on Universities in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 4:30 PM IST

CM Revanth Reddy on Universities in Telangana : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేసి దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలని కొత్త వైస్ ఛాన్సలర్లకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన ఉపకులపతులు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో ఇవాళ భేటీ అయ్యారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతోందని, మళ్లీ విశ్వాసం పెంచేలా పని చేయాలని ఉపకులపతులకు సీఎం రేవంత్​ సూచించారు. విశ్వవిద్యాలయాల గౌరవాన్ని పెంచాలని వీసీలకు తెలిపారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని ఆదేశించారు.

యూనివర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం కోసం అవసరమైతే కన్సల్టెన్సీలను నియమించుకొని నివేదిక తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఒత్తిళ్ల ప్రభావతంతో వీసీలను నియమించలేదని, ప్రతిభ, సామాజిక సమీకరణలనే పరిగణనలోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వీసీలు బాగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, తప్పులు చేస్తే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని రేవంత్​రెడ్డి హెచ్చరించారు.

వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి : మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ, ప్రభుత్వ సహకారం ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డి వారికి హామీ ఇచ్చారు. గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థులను గమనిస్తూ అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

అన్వేషణ కమిటీల ద్వారా ఎంపిక : ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకాల ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు పది విశ్వవిద్యాలయాల వీసీల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకానికి పదేళ్ల అనుభవం తప్పనిసరిగా చేస్తూ నోటిఫికేషన్‌ నాటికి వయసు 65 ఏళ్లలోపు ఉండాలి స్పష్టం చేసింది.

అందిన దరఖాస్తులను విద్యాశాఖ పరిశీలించి అర్హుల పేర్లను అన్వేషణ(సెర్చ్‌) కమిటీకి పంపింది. ఆ కమిటీలోని ముగ్గురు సభ్యలు ముగ్గురు సభ్యులు యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, వర్సిటీ నామినీగా ఉండగా ఒక్కో విశ్వవిద్యాలయానికి మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతంలో తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కొత్త ఉపకులపతుల నియామకాలను పకడ్బందీగా చేపట్టినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.