ETV Bharat / state

Viral Video: ఆర్టీసీ బస్సులోకి వరదనీరు - ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

టీజీఎస్​ ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సులోకి ఒక్క సారిగా వచ్చిన వరద నీరు - బస్సు గ్రౌండ్​ లెవల్​ తక్కువగా ఉండటంతోనే నీరు చేరిందన్న సిబ్బంది

TGS RTC ELECTRIC BUS
RAIN WATER INTO THE TGS RTC BUS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 5:05 PM IST

Rain Water Came into The Electric TGS RTC Bus : శుక్రవారం (నవంబర్​ 01)న సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సులోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు. అందులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇది జరిగింది ఎక్కడో వరద ప్రాంతంలో కాదు మన రాజధాని నగరం హైదరాాబాద్​లో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు నిన్న ప్రయాణికులతో హఫీజ్​పేట్ నుంచి కొండాపుర్ మార్గంలో వెళ్తోంది.

ఆ సమయంలో రహదారిపై నిలిచిన వరద నీరు బస్సులోకి వచ్చి చేరింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కొందరి చెప్పులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొంత సమయం తర్వాత బస్సు డోర్ ఓపెన్ చేయడంతో వరద నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు గ్రౌండ్ లెవల్ తక్కువగా ఉండటంతోనే వరద నీరు లోపలికి వచ్చిందని సిబ్బంది తెలిపారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్​సీయూ డిపో అధికారులు తెలిపారు.

చినుకు పడితే చిత్తడే : హైదరాబాద్​ నగరంలో చినుకు పడితే చాలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే పలు వాహనాలు వరదలో చిక్కుకుని గల్లంతైన సందర్భాలు సైతం ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవ్వడంతో ఆ ప్రాంత ప్రజల పరిస్థితి గందరగోళంగా మారింది.

వర్షం ఆగిన తర్వాత భారీ ట్రాఫిక్ జామ్​ ఏర్పడుతుంది. ఆ ట్రాఫిక్​ జామ్​ నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే మరి. ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించి హైడ్రాను ఏర్పాటు చేసింది. వర్షపునీరు రోడ్లపై నిలవకుండా కాలువల ద్వారా వెళ్లేలా హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కాలువులను ఆక్రమించుకున్న ఇళ్లు, భవనాలను కూల్చివేస్తోంది.

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం - జలమయమైన రహదారులు

ముషీరాబాద్​ను ముంచెత్తిన వరద - ఇళ్లలోకి చేరిన వర్షపునీరు - HYDERABAD FLOODS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.