ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యంతో ఉద్యమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్తూ సూర్యాపేట డిపో ముందు సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని భాజపా కోరుతోందని వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ మొండి వైఖరిని విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!