సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే గాదరి కిశోర్ హజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
స్వామి వారి కల్యాణ మహోత్సవంలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఎంపీటీసీ సభ్యురాలు కునుకు పద్మ, పీఏసీఎస్ ఛైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ చల్లంచర్ల విద్యాసాగర్, గ్రామ సర్పంచి బైరబోయిన సునీత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కొనసాగుతున్న కసరత్తు