సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. వీరికి తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతుగా నిలిచి సమ్మెలో పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణిలో రాష్ట్రం అప్పులపాలైందని కోదండరాం ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ రెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని కోదండరాం పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కండక్టర్ సురేందర్ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి