ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియకు గడువు ఈనెల ఆరో తారీఖు వరకు ఉందని.. పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెజస పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్లలో తేదీలు మార్చి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఓటు నమోదు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన సదస్సులో పాల్గొని.. పట్టభద్రులకు అవగాహన కల్పించారు.
పట్టభద్రులు ఎవరైనా తమ ఓటును తామే నమోదు చేసుకోవాలని, ఇతరులపై ఆధారపడొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. చట్టాలు కఠినంగా ఉన్నాయని హెచ్చరించారు. ఓటు హక్కును రెండు విధాలుగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో నమోదు చేసుకోవచ్చని సూచించారు. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఓటుకు అప్లై చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం