కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ధన్వంతరి హోమాన్ని ఆయన నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నుంచి త్వరగా బయటపడాలనే సంకల్పంతో... శ్రీ ధన్వంతరి, మహారుద్ర, మృత్యుంజయ హోమాలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్... రూపొందించిన డీఆర్డీవో