సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోదాడ శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలుగా పడుతున్న కష్టాల నుంచి విముక్తి కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని మల్లయ్య యాదవ్ కొనియాడారు. 2001లో ఒకడిగా పార్టీని స్థాపించి ఈరోజు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త చరిత్రను లిఖించారని తెలిపారు.
ఇవీ చూడండి: 20 రూపాయల నోటుకు కొత్త రూపు