ETV Bharat / state

కేటీఆర్ జన్మదినం... ఆ చిన్నారి జీవితానికి వరం - kodad mla bollam mallaiah yadav helped a girl

పుట్టుకతోనే మూగ, చెవుడుతో బాధపడుతున్న ఓ చిన్నారికి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం వరంలా మారింది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా స్థానిక ఎమ్మెల్యే చేసిన సాయం ఆ పాప కుటుంబంలో చిరునవ్వులు పూయించాయి.

kodada mla gift to minister ktr
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు​కు కోదాడ ఎమ్మెల్యే బహుమతి
author img

By

Published : Jul 24, 2020, 5:08 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలాజీనగర్​కు చెందిన అన్వర్-అనిత దంపతుల కుమార్తె హబీబాకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేశారు. పుట్టుకతోనే మూగ, చెవుడుతో ఇబ్బంది పడుతున్న హబీబాకు చికిత్స చేయించే స్తోమత లేక తల్లిదండ్రులు నానాఅవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఐదు లక్షల రూపాయలు అందించారు.

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. హబీబాకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసి వారి చిరునవ్వును (గిఫ్ట్ ఏ స్మైల్) బహుమతిగా ఇవ్వాలన్న మంత్రి కేటీఆర్ కోరిక మేరకు చిన్నారికి సాయం చేసినట్లు తెలిపారు. మంత్రి జన్మదినం తమ కుటుంబానికి వరమైందని అన్వర్-అనిత దంపతులు అన్నారు. హబీబా చికిత్సకయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.