ETV Bharat / state

ఆధ్యాత్మికత ట్రెండ్ సృష్టికర్త 'కేసీఆర్': శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి - SURYAPET DISTRICT NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ తన భక్తిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. యాదాద్రి ఆలయ పునరుద్దరణతో ఆధ్యాత్మికత ట్రెండ్ సృష్టికర్తగా కేసీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని... యాదాద్రి దేవాలయ పునరుద్ధరణే అందుకు నిదర్శనమని జీయర్ స్వామి కొనియాడారు.

CJINA_JIYAR_SWAMI_TEMPLE_INNUGURATION
ఆధ్యాత్మికత ట్రెండ్ సృష్టికర్త 'కేసీఆర్'
author img

By

Published : Aug 24, 2021, 1:43 PM IST

సూర్యాపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ పనులకు శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి, మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అభివృద్ధిలో ఆధ్యాత్మికత కూడా భాగమేనని, అటువంటి ఆధ్యాత్మికతను భాగస్వామ్యం చేసినందునే తెలంగాణా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని చిన జీయర్ స్వామి తెలిపారు. అధికారికంగా ఇంతకు ముందెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధిలో దైవాన్ని ఒక భాగంగా మలిచిన ఘనత కూడా ఆయనదే అన్నారు. అదే స్ఫూర్తిని మంత్రి జగదీష్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నారని అభినందించారు

సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతో పాటు పట్టణం విస్తరించి ఉండడంతో దేవాలయాన్ని విస్తరించాలని, మూడేండ్ల క్రితమే నిర్ణయించామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలన్నదే తమ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు

సూర్యాపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి

ఇదీ చదవండి:HEAVY RAIN IN HYDERABAD: తడిసిముద్దైన భాగ్యనగరం.. నరకంలో నగరవాసులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.