ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు వైఫల్యాలకు నిరసనగా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉత్తమ్ హాజరు అవుతున్నారనే ముందస్తు సమాచారంతో కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
దేశ చరిత్రలో ఇంటర్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్‌ను పొరుగు సేవకు అప్పగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. జవాబు పత్రాల ముల్యాంకనానికి లెక్చరర్స్ అడిగిన ధరలను తగ్గించడానికే ప్రభుత్వం అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చిందని ఆరోపించారు. విద్యార్థుల అహ్మహత్యాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. గొప్పలు చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్‌లు దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర