సంతోశ్ బాబుని తీసుకురాలేం కానీ... ఆయన లేని లోటు తీరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చినట్టు... కర్నల్ భార్య సంతోషి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటిస్థలం, రూ. 5కోట్ల చెక్కు అందించినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆమె అన్నారు. ఇందుకు సహకరించిన మంత్రి జగదీశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కూడా... తను కోరిన డిపార్ట్మెంటులో ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సంతోషి చెపారు. అమరులైన మిగతా జవాన్లకు ప్రకటించిన ఆర్థికసాయం కూడా త్వరలోనే అందించనున్నట్టు కేసీఆర్ చెప్పినట్టు ఆమె అన్నారు. తన పిల్లలతో ముఖ్యమంత్రి కాసేపు గడపడం తమకు కొండంత ధైర్యం వచ్చిందన్నారు.
ఇదీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్నిపరామర్శించిన సీఎం కేసీఆర్