కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోకుండా పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిచేశారు. మిర్యాలగూడలో ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపిన జానారెడ్డి... ఆత్మార్పణ చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్ గౌడ్‌లకు నివాళి అర్పించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేసి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రతిపక్షాలను తప్పుబట్టడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేసే విధానం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే అంతవరకు నిరంతరం ఉద్యమాలు చేస్తామని అన్నారు.
ఇదీ చూడండి: ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!