సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మిషన్ భగీరథ పైపులైన్లు పట్టణ వాసులకు ఇబ్బందికరంగా మారాయి. పట్టణం మొత్తం గుంతల మయంగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఎక్కడ పనులు అక్కడే అసంపూర్తిగా వదిలివేసి వెళ్తున్నారని ఆరోపించారు. వర్షం వచ్చినప్పుడు రోడ్లపై పయనించాలంటే జారిపడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి చాలామంది జారిపడ్డారని ఒకానొక సందర్భంలో కాళ్లు, చేతులు విరిగే పరిస్థితి ఏర్పడుతోందని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రోడ్లకు కనీసం మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు హుజూర్నగర్ పట్టణంలోని కాలనీలకు వచ్చిన జాడే లేదని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ను గుంతలనగర్గా నామకరణం చేయ్యొచ్చని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం