ETV Bharat / state

మరో పదిరోజుల పాటు సాగునీరు అందించాలి: కేసీఆర్ - Cm kcr latest updates

సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలు ఎండిపోకుండా నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలని స్పష్టం చేశారు.

KCR REVIEW
సాగునీటిపై కేసీఆర్ రివ్యూ
author img

By

Published : Mar 29, 2021, 7:37 PM IST

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న వరిపంట ఎండిపోకుండా మరో పదిరోజుల పాటు పూర్తిస్థాయిలో నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలోని కొన్నిచోట్ల కాల్వ చివరి భూములకు సరిపడా నీరందించాలని రైతులు కోరుతున్నారని... ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

దిగువ మానేరు డ్యాం నుంచి డీబీఎం-71 పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని కాల్వ చివరి భూములకు సరిపడా కాళేశ్వరం జలాలను అందించాలని ఈఎన్సీ శంకర్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్​లో ఆదేశించారు.

ఇదీ చూడండి: 'ఆరోజు నగరంలోని పలుచోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.