అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఆలస్యంగా అవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో 243మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్షకు హాజరయ్యారు.
వారికి ఇవ్వాల్సిన ప్రశ్నా పత్రాల కోసం అధికారులు సీల్డ్ కవర్ తెరచి చూశారు. అందులో కొన్ని పత్రాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సూర్యాపేటలోని మూడు కళాశాలల నుంచి ప్రశ్నా పత్రాలు తెప్పించారు. దీంతో పరీక్ష 1:15నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయిందని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
"ప్రశ్నా పత్రాల కొరత వల్ల పరీక్ష ఆలస్యమయింది. పరీక్ష 1:15నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయింది. వెంటనే వేరే దగ్గరి నుంచి ప్రశ్నా పత్రాలు తెప్పించి ఇచ్చాం. పరీక్ష రాసేందుకు మరికొంత సమయం విద్యార్థులకు ఇచ్చాం. విద్యార్థులు కొంత ఆసౌకర్యానికి గురయ్యారు. కానీ వారు ప్రశాంతంగానే పరీక్ష రాశారు." - ప్రభాకర్ రెడ్డి జిల్లా ఇంటర్ బోర్డు అధికారి
ఇదీ చదవండి: 'సర్కారు కొలువు కొట్టాలంటే.. వాటికి దూరంగా ఉండాలి'
ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం- ఫుల్ స్ట్రెంథ్తో సుప్రీంకోర్టు!