ETV Bharat / state

వైభవంగా అమరవరం గట్టు జాతర... శానంపూడి ప్రత్యేక పూజలు

సూర్యాపేట జిల్లా అమరవరం శ్రీ లింగమంతుల స్వామి గట్టు జాతర వైభవంగా జరుగుతోంది. ఈ జాతరలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

huzurnagar-mla-sanampudi-saidireddy-participated-in-lingamanthula-swamy-jatara-at-amaravaram-in-suryapet-district
వైభవంగా అమరవరం గట్టు జాతర... శానంపూడి ప్రత్యేక పూజలు
author img

By

Published : Mar 1, 2021, 3:39 PM IST

అమరవరం శ్రీ లింగమంతుల స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హజూర్​నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఈ జాతరకు మంచి పేరు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం అమరవరంలో శ్రీ లింగమంతుల స్వామి గట్టు జాతర వైభవంగా జరుగుతోంది. సూర్యకిరణాలు లింగమంతుల స్వామిని తాకగా అద్భుతంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చిన ఎమ్మెల్యే... ప్రత్యేక పూజలు జరిపారు.

huzurnagar-mla-sanampudi-saidireddy-participated-in-lingamanthula-swamy-jatara-at-amaravaram-in-suryapet-district
జాతరలో మాట్లాడుతున్న శానంపూడి

ఈ జాతర అభివృద్ధి కోసం అవసరమైతే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి: అట్టహాసంగా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.