ETV Bharat / state

కాంగ్రెస్​ కంచుకోటలో నేతల వ్యూహ-ప్రతివ్యూహాలు - saidhi reddy

ఉప ఎన్నికలో విజయం కోసం... ఇరు పార్టీలు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు స్వయంగా మండలాలన్నీ చుట్టి వస్తున్నారు. అటు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు... నియోజకవర్గంలో అప్పుడే రంగప్రవేశం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు, నాయకులు గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కాంగ్రెస్​ కంచుకోటలో నేతల వ్యూహ-ప్రతివ్యూహాలు
author img

By

Published : Sep 26, 2019, 5:05 AM IST

Updated : Sep 26, 2019, 9:12 AM IST

కాంగ్రెస్​ కంచుకోటలో నేతల వ్యూహ-ప్రతివ్యూహాలు

ఉప ఎన్నికతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూర్ నగర్... పార్టీల నాయకుల రాకతో కొత్త కళను సంతరించుకుంటోంది. తెరాస, కాంగ్రెస్ నేతల వ్యూహ, ప్రతివ్యూహాల నడుమ... పోరు రసకందాయంగా సాగబోతోంది. సొంత నియోజకవర్గంలో మరోసారి పైచేయి సాధించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... సెగ్మెంట్​ను విడిచిపెట్టని విధంగా అన్ని వర్గాలను కలుసుకుంటున్నారు.

అన్నీ తానై ఉత్తమ్​

అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆయన సతీమణి పద్మావతి ఇప్పటి వరకు నియోజకవర్గానికి రాకున్నా... ఉత్తమే అన్నీ తానై చూస్తున్నారు. ఏడు మండలాలు గల హుజూర్ నగర్ సెగ్మెంట్​లో... ఇప్పటికే ఇంచుమించు అన్ని మండలాల్లో పీసీసీ చీఫ్ పర్యటించారు. వరుసగా మూడు సార్లు గెలిచిన అనుభవానికి తోడు... గతంలో తమ పార్టీ నుంచి తెరాసలో చేరిన వారిని మచ్చిక చేసుకునే పనిలో పడినట్లు కనపడుతోంది. అందుకే పగలు, రాత్రి తేడా లేకుండా ఎక్కడికక్కడ ఉత్తమ్... విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.

గ్రామగ్రామాన పర్యటన

చింతలపాలెం మండలం నక్కగూడెం, చింతిర్యాల, రేబల్లె గ్రామాల్లో బుధవారం తిరిగారు. గతంలో జరిగిన ఎన్నికల్లో తన విజయం కోసం మండలాల వారీగా పర్యటనలు చేపట్టి... గ్రామాల బాధ్యతల్ని ద్వితీయ శ్రేణి నాయకులకు ఉత్తమ్ అప్పగించేవారు. కానీ ఈ ఉపఎన్నికల్లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదన్న చందంగా... స్వయంగా తానే గ్రామ గ్రామాన తిరుగుతూ... కింది శ్రేణి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అస్త్రాలు సిద్ధం చేస్తున్న తెరాస

అటు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సైతం... అన్ని అస్త్రాల్ని సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో అవసరం ఉన్నా సేవలు అందించే పల్లా రాజేశ్వర్ రెడ్డికి హుజూర్ నగర్ బాధ్యతలు కూడా కట్టబెట్టడంతో... ఆయన సెగ్మెంట్ పై దృష్టి సారించారు. అప్పుడే కొన్ని మండలాల నాయకులతో సమాలోచనలు జరిపారు. అత్యంత గోప్యత పాటిస్తూ స్థానిక నాయకుల్ని కలుసుకుంటున్న పల్లా... ఉత్తమ్​ను ఢీ కొట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకుల సూచనలు, స్వీయ ఆలోచనలతో... పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే పనిలో పడ్డారు.

గెలుపు దిశగా వ్యుహాలు

ముఖ్యంగా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పట్ల జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు... పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు పార్టీ సీనియర్ నేతలంతా అతి త్వరలోనే హుజూర్ నగర్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తానే స్వయంగా వస్తానని అభ్యర్థికే నేరుగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో... సీఎం వచ్చేలోగానైనా పరిస్థితుల్ని తమకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలన్న తపన... తెరాసలో కనపడుతోంది. మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే, లేదంటే పార్టీ సీనియర్ నేతను రంగంలోకి దించే అవకాశం ఉండటంతో... అధికార పార్టీ యంత్రాంగమంతా హుజూర్ నగర్​నే కేంద్రంగా చేసుకునే పరిస్థితి ఉంది.

అటు ఉత్తమ్, ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వ్యూహా ప్రతివ్యూహాలతో... హుజూర్ నగర్ ఉప ఎన్నికలో వేడి రాజుకుంటోంది.

ఇదీ చూడండి: వర్షపు నీటిని తరలించేందుకు ట్రాఫిక్​ సీఐ పాట్లు

Last Updated : Sep 26, 2019, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.