రాష్ట్రంలో ఎత్తిపోతల ద్వారా మెుత్తం 3.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే...అందులో ప్రత్యేకంగా హుజూర్‌నగర్‌కు 55 వేల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌దని మాజీ మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. తెరాస నేతలు బూటకపు మాటలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. అహంకారంతో రాజ్యమేలాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 700 మంది కాదు... కేసీఆర్ దిగొచ్చిన ఏం కాదని తెలిపారు. హుజూర్నగర్ ఉపఎన్నిక నియంత కేసీఆర్, 4 కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోటీ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుక లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వెంకట్ రెడ్డి తెలిపారు.
'700 మంది కాదు... కేసీఆర్ దిగొచ్చినా కాంగ్రెస్‌దే విజయం' - huzurnagar by election news
తెరాస ప్రభుత్వం ఐదేళ్లలో హుజూర్నగర్ నియోజకవర్గానికి ఒక ఎకరానికైనా సాగు,తాగు నీరు అందించిందా అని మాజీ మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ రూ.3 లక్షల కోట్ల అప్పు చేసి మూడు ఇళ్లు కూడా కట్టలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.