ETV Bharat / state

'మేము శ్వేత పత్రం విడుదల చేస్తాం... మీరు చేస్తారా?' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

హుజూర్​నగర్​లో తెరాస, భాజపా శ్రేణుల నడుమ వాగ్వాదం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన సవాలుపై భాజపా జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి స్పందించారు. తెరాస చేసిన అభివృద్ధి ఏమీ లేదని... కేంద్రం నిధులతోనే గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

huzurnagar bjp fire on trs government in suryapet district
'మేము శ్వేత పత్రం విడుదల చేస్తాం... మీరు చేస్తారా?'
author img

By

Published : Nov 4, 2020, 2:27 PM IST

సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్​ నియోజకవర్గంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన సవాలుపై భాజపా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి స్పందించారు. తెరాస చేసిన అభివృద్ధి ఏమీ లేదని... కేంద్రం నిధులతోనే గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమి లేవని విమర్శించారు. పేదలకు ఆరేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తమ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సైదిరెడ్డి పాలనపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై తాము విడుదల చేస్తామని అన్నారు.

వాగ్వాదం

హుజూర్​నగర్ ఉప ఎన్నికలో తెరాస గెలిచి అభివృద్ధి చేసింది ఏమి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు. ఒక్క ఏడాదిలోనే రూ.200 కోట్ల పనులు చేశామని తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో కూర్చొని తేల్చుకుందాం అని బండి సంజయ్​కు సవాల్ విసిరారు.

ఇదీ చదవండి: వలిగొండ మూసీ వాగులో గుర్తు తెలియని మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.