ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ మండలాల్లో జోరుగా కురిసిన వర్షంతో మంచి వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో అత్యధికంగా 10.9 సెంటీమీటర్ల వాన పడింది. మండలాల వారీగా చూస్తే... బొమ్మలరామారంలో 10.2, భువనగిరిలో 9.8, బీబీనగర్లో 8.7, భూదాన్ పోచంపల్లిలో 8.6, తుర్కపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా... 28.5 వర్షం కురిసింది. తిరుమలగిరిలో 3.4, తుంగతుర్తి మండలంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.