సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. సుమారు వెయ్యి ఎకరాల పంట నీట మునిగింది.
తుంగతుర్తి మండలం కేశవాపురం అన్నరం వాగులో చంద్రయ్య అనే 66 ఏళ్ల గొర్రల కాపరి వాగు దాటుతండగా నీటి ప్రవాహం దాటికి గల్లంతయ్యాడు. అతని ఆచూకి కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు.
వర్షం దాటికి వలస..
అర్వపల్లిలో 93.6 మిమీ వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ హరిచంద్రప్రసాద్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరి ప్రజలు వేరే గ్రామాల్లో తలదాచుకున్నారు. తీగల చెరువు అలుగు పోసి సుమారు వంద ఎకరాల వరి పంట నీటిపాలయ్యింది. జాజిరెడ్డిగూడానికి వెళ్లే దారిలో రోడ్డుపై నీరు నిలిచి ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నూతనకల్ మండలంలో ఎడవెల్లి, నూతనకల్, తాళ్లసింగారం, చిల్పకంట్ల, గుండ్లసింగారం గ్రామాల్లో సుమారు 6 వందల ఎకరాల వరిపంట, మూడ వందలు ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది.
ఇదీ చూడండి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం