ETV Bharat / state

లింగమంతుల జాతరకు మూడో రోజూ పోటెత్తిన భక్తులు - telangana news

సూర్యాపేట జిల్లాలో గొల్లగట్టు జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. లింగమంతుల స్వామి, చౌడమ్మ దేవిని దర్శించుకునేందుకు దూరాజ్‌పల్లి గుట్టకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తజనంతో ఆలయ ప్రాంగణం వద్ద రద్దీ నెలకొంది.

heavy devotees visited lingamanthula swamy jathara in suryapeta district
లింగమంతుల జాతరకు మూడో రోజూ పోటెత్తిన భక్తులు
author img

By

Published : Mar 2, 2021, 3:25 PM IST

సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు జాతరలో మూడో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగమంతుల స్వామి, చౌడమ్మను దర్శించుకునేందుకు.. ఆలయాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు పెద్దగా రద్దీ లేకున్నా... ఆ తర్వాత క్రమంగా జనం రాక మొదలైంది.

దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... పసుపు, కుంకుమలతో యాదవ హక్కుదారులు సంప్రదాయానుసారం చంద్రపట్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై... ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: పెట్రో బాదుడు నుంచి త్వరలోనే ఊరట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.