సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల బస్టాండ్లో నివాసముంటున్న వృద్ధ దంపతులకు... హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందజేశారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన గంగిరెద్దుల గట్టయ్య 20సంవత్సరాల కిందట కరివిరాల గ్రామానికి వచ్చారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం గడుపేవారు. వృద్ధాప్యం కారణంగా ఆయన కాళ్లు పడిపోయి కదల్లేని స్థితిలో ఉన్నాడు. అతని భార్య ఎల్లమ్మ భిక్షాటన చేస్తే ఇద్దరు కడుపు నింపుకుంటున్నారు.
ఈ దుస్థితికి తోడు వారికి ఉండేందుకు నివాసం లేక రోడ్డుపక్కన బస్టాండ్లో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడే అంత్యంత దుర్భరంగా జీవనం సాగిస్తున్నారు. వీరి గురించి హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ తెలుసుకుంది. ఆ వృద్ధ దంపతులకు 25కేజీల బియ్యం, నిత్యావసరాలు, దుప్పట్లు, దుస్తులను అందజేశారు. పండుగ పూట ఎవరూ పస్తులుండకూదని పౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: సంక్రాంతి సంబురాలు... పొంగల్ తయారు చేసిన గవర్నర్