ETV Bharat / state

గుర్రంబోడు తండా వివాదాస్పద భూముల వెనుక కథేంటంటే? - gurrambodu police were attacked by bjp leaders

నాగార్జునసాగర్​ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కింద ఇచ్చిన భూముల్లో స్థానిక గిరిజనులు 40 ఏళ్లుగా సేద్యం చేస్తున్నారు. ఆ భూముల్లో గ్రానైట్ ఉందని తెలుసుకున్న కొన్ని కార్పొరేట్ కంపెనీలు వాటిని దక్కించుకునేందుకు నకిలీ పట్టాలు సృష్టించాయి. రెండేళ్లుగా ప్రైవేట్ కంపెనీలు, గిరిజనులకు మధ్య జరుగుతున్న వివాదం నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తెరపైకి వచ్చింది.

gurrambodu police were attacked by bjp leaders due to land dispute
గుర్రంబోడు తండా వివాదాస్పద భూములు
author img

By

Published : Feb 9, 2021, 9:26 AM IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కింద 40 ఏళ్ల కింద ఇచ్చిన భూములవి. దట్టమైన అడవి, సుదూర ప్రాంతం కావడంతో సుమారు 70 శాతం మంది నిర్వాసితులు ఈ భూముల్లోకి రాలేదు. స్థానికంగా ఉన్న కొందరు గిరిజనులు వాటిలో కొన్నేళ్లుగా సేద్యం చేస్తున్నారు. భారీగా గ్రానైట్‌ ఉన్న ఈ భూములపై కొన్ని ప్రైవేటు కంపెనీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్పొరేట్‌ కంపెనీల కన్నుపడింది. రెవెన్యూ అధికారుల సాయంతో అవి ఈ భూముల్లో పట్టాలు సృష్టించుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిని కొన్నామని చెప్పి.. ఏళ్లుగా కాస్తులో ఉన్న తమను కంపెనీలు తరిమేస్తున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.

ప్రైవేటు యాజమాన్యాలు, గిరిజనులకు మధ్య రెండేళ్లుగా ఈ వివాదం నడుస్తోంది. కంపెనీ యాజమాన్యాలకు స్థానిక నాయకులు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దాడుల వెనుక పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ క్లుప్తంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు తండా వివాదాస్పద భూముల కథ. రెండేళ్లుగా ఈ వివాదం నడుస్తూ తమపై దాడులు జరుగుతున్నా ఏ పార్టీ స్పందించలేదని, ఇప్పుడు పక్కనే ఉన్న సాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో నాయకులు ఇక్కడకు వస్తున్నారని గిరిజనులు అంటున్నారు. 20 ఏళ్లుగా పట్టాల కోసం పోరాడుతున్నామని వాటిని ఇప్పించాలని కోరుతున్నారు.

450 ఎకరాల్లోనే వివాదం

పెదవీడు రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 540లో 6,239 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2,411.27 ఎకరాలు అటవీ భూమి కాగా.. 1,951 ఎకరాలు ప్రభుత్వ భూమి. మిగిలిన 1,876.01 ఎకరాలను 328 కుటుంబాలకు 1960లో సాగర్‌ నిర్వాసితులుగా గుర్తిస్తూ ప్రభుత్వం డీ- ఫాం పట్టాలిచ్చింది. ఈ భూముల్లోనే ఇక్కడి గుర్రంబోడు తండా, భోజ్య తండాల్లోని దాదాపు 500 కుటుంబాలు సేద్యం చేసుకుంటున్నాయి. వీరిలో చాలామందికి పాసుపుస్తకాలుండి, రైతుబంధు డబ్బులు సైతం అందుతున్నాయి. అయితే దాదాపు 450 ఎకరాలను తాము అన్ని ఆధారాలతో కొన్నామని ప్రైవేటు కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ భూముల్లోనే వివాదం నడుస్తోంది. క్షేత్రస్థాయిలో 6 వేల ఎకరాలుంటే 12 వేల ఎకరాలకు పట్టాలిచ్చిన ఇద్దరు తహసీల్దార్లను గతేడాది ఆగస్టు 21న కలెక్టరు సస్పెండ్‌ చేశారు.

సర్వేలో ఆసక్తికర విషయాలు

నిత్యం తమపై దాడులు జరుగుతున్నాయని గిరిజనులు ఫిర్యాదు చేయడంతో కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి సర్వే నంబరు 540ని సమగ్రంగా సర్వే చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాగర్‌ నిర్వాసితుల భూములు 1,876 ఎకరాలున్నట్లు గుర్తించారు. ఈ భూముల్లో ఎక్కువ శాతం నిర్వాసితుల చేతిలో కాకుండా వివిధ కంపెనీలు, స్థానిక నాయకుల పేరిట ఉన్నట్లు వెల్లడైంది. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు బినామీ పేర్లతో 178 ఎకరాలకు పట్టాలు సృష్టించుకోగా మరో 246 ఎకరాల ప్రభుత్వ భూమిలో సిమెంటు కంపెనీ అక్రమంగా మైనింగ్‌ చేస్తోందని గుర్తించినట్లు తెలిసింది. ‘‘ప్రైవేటు కంపెనీకి చట్టపరంగా ఈ భూములపై హక్కులున్నా, పట్టాలు పొందాలంటే రైతుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయిన భూములనే కొనాలి. అప్పుడే ఆ భూములకు పట్టాలిస్తారు. అయితే ఇవి నిర్వాసితుల భూములు. వారు స్థానికంగా లేరు. గిరిజనులు ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. అన్ని పరిశీలించిన తర్వాత ప్రైవేటు కంపెనీకి చెందిన పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని పేరు రాయడానికి ఇష్టపడని ఓ అధికారి ‘ఈనాడు’తో అన్నారు. ‘ఇందులో పెద్దపెద్ద కంపెనీలు, పలువురు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఉండటంతో సర్వేను ఉన్నది ఉన్నట్లు బహిర్గతం చేస్తారన్న నమ్మకం లేదు’ అని క్షేత్రస్థాయి సిబ్బంది ఒకరు అభిప్రాయపడ్డారు.

త్వరలోనే పరిష్కారం

540 సర్వే నంబరులోని 6 వేల ఎకరాలను సర్వే చేశాం. 1,876 ఎకరాల భూమి నిర్వాసితులకు చెందినదిగా గుర్తించాం. ఇందులో కొంత భూమిని ఓ ప్రైవేటు కంపెనీ చట్టపరంగా కొన్నా అక్కడ కాస్తులో ఇతరులున్నారు. కాస్తులో వేరే వాళ్లు ఉండగా నిబంధనలను ఉల్లంఘించి కంపెనీకి పట్టాలిచ్చారనే కారణంతోనే ఇద్దరు ఎమ్మార్వోలను సస్పెండ్‌ చేశాం. త్వరలోనే ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం కనుగొంటాం.

- వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్‌, సూర్యాపేట జిల్లా

కొట్టి జైల్లో పెట్టారు

540 సర్వే నెంబరులో నాకు మూడెకరాల పొలం ఉంది. 40 ఏళ్లుగా దాంట్లో సేద్యం చేస్తున్నాం. రెండేళ్ల క్రితం ఎవరో ప్రైవేటు కంపెనీ వాళ్లు వచ్చి ఈ భూములు మావంటే అభ్యంతరం చెప్పాం. దీంతో గుండాలు, పోలీసులతో మమ్మల్ని కొట్టించి మాపైనే కేసులు బనాయించి రెండు నెలల పాటు జైల్లో పెట్టారు.

- అజ్మీరా హర్య, గుర్రంబోడు తండా

కాళ్లు పనిచేయడం లేదు

35 ఏళ్లుగా మేం ఈ భూముల్లో కాస్తులో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినవారు మమ్మల్ని ఇక్కడి నుంచి గెంటేస్తున్నారు. ఇదేంటని అడిగితే పోలీసులతో కొట్టించారు. ఆ దెబ్బలకు కాళ్లు పనిచేయటం లేదు. పట్టాలు అడిగితే విచక్షణారహితంగా కొట్టి అరాచకం సృష్టిస్తున్నారు.

-సౌదాసత్‌ మోత్యనాయక్‌, భోజ్యతండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.