ETV Bharat / state

చెట్టుపై ఉండగా గుండెపోటు.. గీత కార్మికుడు మృతి

author img

By

Published : Sep 15, 2020, 9:10 AM IST

తాటి చెట్టుపై కల్లు గీస్తుండగా గుండెపోటు వచ్చి.. చెట్టుపైనే గీత కార్మికుడు మరణించిన ఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

gita wiorker died due to heartattack on palm tree at suryapet district
ఈత చెట్టుపై గుండెపోటుతో గీత కార్మికుడు మృతి

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో కుంభం సోమయ్య అనే గీత కార్మికుడు.. రోజువారి వృత్తిలో భాగంగా కల్లు తీసేందుకు తాడిచెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. అతను తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే చెట్టుపైనే చనిపోయిన సోమయ్య వేలాడుతూ కనిపించాడు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. బోరున విలపించారు. అతనిపైనే ఆధారపడిన కుటుంబసభ్యులకు ప్రభుత్వం గీత కార్మికులకు అందించే ఎక్స్​గ్రేషియా చెల్లించాలని గీత కార్మిక సంఘం సభ్యులు.. స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.

ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.