సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోకి కృష్ణానది ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం రెండు అడుగుల మేర నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ దేవస్థానాలలో ఇది ఒకటి. వరద నీరుతో భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవాహం మరింత పెరిగితే గర్భగుడిలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: గాయత్రి పంపుహౌస్‌లో బాహుబలి పంపుల వెట్‌రన్