ETV Bharat / state

వినియోగదారుల వద్దకే డీజిల్..

రాష్ట్రంలోనే మొట్ట మొదటి మొబైల్ డీజిల్ ట్యాంకర్ ను సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ప్రారంభించారు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయిలోకి డీజిల్ అందుబాటులోకి తేవడమే లక్ష్యమని తెలిపారు.

Diesel at consumers door step..
వినియోగదారుల వద్దకే డీజిల్..
author img

By

Published : Nov 2, 2020, 7:28 PM IST

రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారి మొబైల్ డీజిల్ ట్యాంకర్ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ప్రారంభమయింది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి దీనిని ప్రారంభించారు.. నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయిలోకి డీజిల్ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో మొబైల్ డీజిల్ ట్యాంకర్ ను ప్రారంభించారు. గ్రామాల్లో రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు ఇంటివద్దకే వెళ్లి డీజిల్ సరఫరా చేస్తామని సొసైటీ సభ్యులు తెలిపారు.

రైతుల కళ్లాల దగ్గరకే వెళ్లి ధాన్యం ఎలా కొంటున్నామో… అట్లాగే రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలకి డీజిల్ సరఫరా చేసేలా ఈ మొబైల్ డీజిల్ ట్యాంకర్​ను తయారు చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే. అత్యాధునిక హంగులతో రూపొందించిన మొబైల్ డీజిల్ ట్యాంకర్ 6000 లీటర్ల డీజిల్ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చిందని డిసిసిబి ఛైర్మన్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నడిగూడెం సహకార సంఘం లాభాలబాటలో నడుస్తూ రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన సదస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.