సూర్యాపేట జిల్లా కోదాడలో రాయల్ అపార్ట్మెంట్ వద్ద గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మంటలు రావడం వల్ల ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమై పోయింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ట్రాక్టర్ కాలి పోయింది. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండటం, గడ్డిలోడు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో ప్రజలకు రేపు మోదీ వీడియో సందేశం