సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగలితండా గ్రామంలోని తీజ్ వేడుకల్లో పాత కక్షలు బయటపడ్డాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తెరాస రెబల్ అభ్యర్థి వర్గం, ఓడిపోయిన తెరాస అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ మొదలై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఇరువర్గాల వారు దహనం చేశారు. ఇందులో పలువురికి గాయాలు కాగా వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది. కానీ శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మళ్లీ ఒకరిపై ఒకరు దాడులు జరుపుకున్నారు. ఇరువర్గాల వారిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: 'బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం'