పలుకుబడి ఉన్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ.. అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యం పహాడ్లో జరిగింది.
ఐకేపీ సెంటర్ నిర్వాహకులు.. సబ్ సెంటర్లు నిర్వహించకూడదన్న నిబంధనలను పాటించడం లేదంటూ స్థానిక రైతులు ఆరోపించారు. తమ ధాన్యం కొనుగోలు చేయకుండా పక్క మండలాల రైతుల నుంచి కొనుగోళ్లు చేపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లను ఒకే దగ్గర చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు