సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో 'మన కోసం మనం' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రతీ ఆదివారం పది గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా నిరుపయోగంగా ఉన్న నీటి పాత్రలు, పాత సామాన్లలో నిలువ ఉన్న నీటిని తొలగించి అధికారులు, ప్రజాప్రతినిధులు శుభ్రం చేశారు.
దోమల నివారణ కోసం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రతీ ఇంటికి జాగ్రత్తలు తెలిపే డోర్ స్టిక్కర్ను మెప్మా ఆధ్వర్యంలో అంటించారు. ఈ కార్యక్రమంలో టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేతతో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.