సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనాడు క్రికెట్ పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్ టీఎస్ మోడల్ కాలేజ్ (ఆత్మకూరు) వర్సెస్ శ్రీ మేధా జూనియర్ కాలేజ్ (సూర్యాపేట) తలపడ్డాయి. ఈ పోటీలో ఆత్మకూరు టీఎస్ మోడల్ కాలేజ్ జట్టు మ్యాచ్ గెలిచింది.
రెండో ఆటలో ఆల్ఫా జూనియర్ కాలేజ్ (నల్గొండ) వర్సెస్ టీఎస్ మోడల్ కాలేజ్ (మునగాల) తలపడగా.. ఆల్ఫా జూనియర్ కాలేజ్ జట్టు విజయం సాధించింది.
మూడో మ్యాచ్ నల్గొండలోని డాన్ బాస్కో కాలేజ్ వర్సెస్ నాగార్జున సాగర్ పాలిటెక్నిక్ కాలేజ్ జట్లు తలపడ్డాయి. ఈ ఆటలో సాగర్ పాలిటెక్నిక్ కాలేజ్ జట్టును విజయం వరించింది.
నాలుగు మ్యాచ్లో ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీ యాదగిరిగుట్ట వర్సెస్ కేఎల్ఎన్ జూనియర్ కాలేజీ మిర్యాలగూడ జట్లు తలపడాల్సి ఉండగా... క్రీడాకారులు సరైన ధ్రువపత్రాలు ఇవ్వనందున నిర్వాహకులు ఆటను రద్దు చేశారు.