ETV Bharat / state

పరిశీలకుల ఎఫెక్ట్​... హుజూర్​నగర్​​లో లెక్కలన్నీ పక్కాగా! - political latest news

డీజేలు, ర్యాలీలు, వాహనాల కాన్వాయ్... ఇలా ప్రతిదానికీ లెక్కున్నా ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేసేవారు. వేసుకునే కండువాలు, పంచే కరపత్రాల నుంచి అన్నింటికీ లెక్కలు చెప్పాల్సి ఉన్నా... వాటిని ఎవరో ఒకరి పేరు మీద రాసేసి చేతులు దులుపుకునేవారు. కానీ ఎన్నికల సంఘం తీక్షణంగా దృష్టి సారిస్తే... అలాంటి దొంగ లెక్కలకు కాలం చెల్లినట్లే. మామూలు ఎన్నికల్లోనైతే పెద్దగా దృష్టి సారించే అవకాశం ఉండదు. ఉపఎన్నిక... అందునా రాష్ట్రంలో జరిగే ఏకైక ఎన్నిక కావడం... విపక్షాలు ఫిర్యాదులతో పోటీ పడుతుంటే ఈసీ మామూలుగా తీసుకోదు కదా. అందుకే హుజూర్​నగర్ ఉప ఎన్నిక కోసం ముగ్గురు పరిశీలకుల్ని నియమించింది. అడుగు తీసి అడుగేస్తే లెక్కేనన్న రీతిలో సాగుతున్న పర్యవేక్షణతో... పార్టీల్లో గుబులు మొదలైంది. అంతిమంగా హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో... హడావుడిని పార్టీలు తగ్గించాయి.

ec-appointment-three-observers-for-by-election-2019
author img

By

Published : Oct 15, 2019, 10:15 AM IST

పరిశీలకుల ఎఫెక్ట్​... హుజూర్​నగర్​​లో లెక్కలన్నీ పక్కాగా..

ఎన్నికలంటేనే... వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అధికారిక లెక్కలకన్నా... అనధికార లెక్కలే ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థులైతే... ఎన్ని నిబంధనలున్నా అవి మాకు పట్టవులే అన్న ధోరణితోనే ఉంటారు. కానీ అసలు సిసలు అధికారులు రంగంలోకి దిగితేనే... వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. మొన్నటి వరకు లెక్కా పక్కా లేనంత తీరుగా వ్యవహరించిన పార్టీలు... ఇప్పుడు ఒకే ఒక్క అధికారి రాకతో చేసే ఖర్చులన్నింటినీ జాగ్రత్తగా లెక్కేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితానికి, ఇప్పటికీ చూస్తే... హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో అనవసర హడావుడి బాగా తగ్గిపోయింది.

ముగ్గురు ఎన్నికల పరిశీలకులు...

ఈ నెల 4న హుజూర్​నగర్ పట్టణంలో... తెరాస రోడ్ షో నిర్వహించింది. కేటీఆర్, జగదీశ్ రెడ్డి సహా అభ్యర్థి పాల్గొన్న ర్యాలీ... బైపాస్​లోని మఠంపల్లి దారి నుంచి ఇందిరా సర్కిల్ వరకు కొనసాగింది. డీజేలు, లౌడ్ స్పీకర్లు, వేలాది మందితో చేపట్టిన ర్యాలీ... నిబంధనల్ని గాలికొదిలేసేలా ఉందన్న కారణంతో అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి అధికార పార్టీతో పాటు మిగతా పక్షాలూ ఆత్మరక్షణలో పడ్డాయి. ముగ్గురు పరిశీలకుల్ని నియమించడం... అందులో ఇద్దరు ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఉండటం... 20కి పైగా షాడో బృందాలు, ఫ్లయింగ్ స్వాడ్స్, ఎస్​ఎస్​టీ, వీడియో చిత్రీకరణ బృందాలు ఇలా... ఎన్నికల్ని డేగ కళ్లతో పరిశీలించడం మొదలైంది. మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ సచీంద్ర ప్రతాప్ సింగ్ సాధారణ పరిశీలకుడిగా... అదే రాష్ట్రానికి చెందిన జి.కె.గ్లోకాని అనే ఐఆర్ఎస్ అధికారిని వ్యయ పరిశీలకుడిగా పంపారు. వీరిద్దరూ ప్రకటన వెలువడిన వెంటనే నియమితులు కాగా... మరో విశ్రాంత ఐఆర్ఎస్ బి.ఆర్.బాలకృష్ణన్​కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా అక్టోబరు 4న ఈసీ బాధ్యతలు కట్టబెట్టింది.

ఆయన వస్తున్నారని గుబులు...

బి.ఆర్.బాలకృష్ణన్ వస్తున్నారని తెలియగానే... రెండు ప్రధాన పార్టీల నేతలు ఆయన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. వివరాలన్నీ కూలంకషంగా సేకరించారు. 1983 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన బాలకృష్ణన్... ఆదాయ పన్ను శాఖలో డీజీగా పనిచేశారు. 2016లో కర్ణాటక, గోవా రీజియన్లో పనిచేసి... నిక్కచ్చైన అధికారిగా పేరుపొందారు. నోట్ల రద్దు సమయంలోనూ అక్రమ లావాదేవీలు జరగకుండా... ప్రత్యేక పద్ధతుల్లో నిఘా వేసి ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలాంటి అధికారి అడుగుపెడుతున్నాడని తెలియగానే... పార్టీలు హడావుడి తగ్గించాయి. ఇంతకుముందులా ఇష్టమొచ్చిన తీరుగా వాహనాలు వాడకపోవడం, ఎక్కడికెళ్లినా ఎక్కువ మంది వెంట లేకుండా చూసుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాయి.

ఉల్లంఘనలు లేకుండా...

పోరును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఇరు పార్టీలు... కీలక నేతల్ని రంగంలోకి దించాలని భావించినా... అనవసర సమస్యలెందుకన్న కోణంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 11 నుంచి 13 వరకు... మూడు రోజుల పాటు ఆరు మండలాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ ఖరారైనా... చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దైంది. ఇందుకు ప్రధాన కారణం... ఖర్చులు ఎక్కువవుతాయన్నది పార్టీ నేతల మాటగా వినిపించింది. కాంగ్రెస్ కూడా వాహనాల సంఖ్యను బాగా తగ్గించింది. జెండాలు, కరపత్రాలు అంతకంతకూ తగ్గిపోయాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో ముందుగానే ఊహించిన పార్టీలు... అనవసరంగా చిక్కుల్లో పడడమెందుకన్న రీతిగా వ్యవహరిస్తున్నాయి.

ఇక్కడే ఎక్కువ...

ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి గరిష్ఠ వ్యయ పరిమితి... రూ.28 లక్షలు. కానీ హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో... అంతకు నాలుగు వందల రెట్లకు పైగా ఖర్చవుతాయంటున్నాయి... నిఘా వర్గాలు. ఈ అంచనాల్ని బట్టే... హుజూర్​నగర్​పై ఈసీ నజర్ పెట్టింది. 2014, 2018 ఎన్నికల్లో అత్యధిక ధన ప్రవాహం జరిగిన నియోజకవర్గాల్లో... హుజూర్​నగర్ ముందు వరుసలో నిలిచింది. 2014 ఎన్నికల సమయంలో పట్టుబడిన నగదులో... సింహభాగం ఈ సెగ్మెంట్​దేనని ఎన్నికల సంఘం గుర్తించింది.

హడావుడి తగ్గింది...

ఈసీ నియామకంతో రంగంలోకి దిగిన బాలకృష్ణన్... ఎక్కడిక్కడ బృందాల్ని నియమించారు. ఇప్పటివరకు చెక్ పోస్టుల వద్ద తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మసలుకోవాల్సి వస్తోంది. అందులో భాగంగానే మంత్రి జగదీశ్ రెడ్డి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాస్తవానికి మంత్రి అయినా మామూలు వ్యక్తి అయినా... తనిఖీలు జరగాల్సిందే. కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఇలాంటివి కనపడవు. కానీ ఐఆర్ఎస్ అధికారి రంగంలోకి దిగిన తర్వాత... అన్నీ మారిపోయాయి. నగదు నిల్వలు నియోజకవర్గానికి ఎలా చేరుకుంటున్నాయి... ఓటర్లకు నాయకగణం ఏ విధంగా పంచబోతోంది... అంతిమంగా అభ్యర్థులు చేసే వ్యయమెంత అన్న అంశాలపై... నిఘా బృందాలతో వివిధ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఇలా పకడ్బందీ చర్యలతో... లోలోపలే తప్ప బయటకు పెద్దగా హడావుడి కనిపించకుండా ఉప ఎన్నికల ప్రచారం సాగిపోతోంది.

ఇదీ చూడండి:'ఆర్థిక మందగమనానికి జీఎస్టీనే కారణం'

Intro:హైదరాబాద్ : మీర్ పెట్ లోని అగ్రికల్చర్ కాలనీలో తము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కింది. గత 35 సంవత్సరాల నుండి ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని GHMC అధికారులు, స్థానిక కార్పొరేటర్ పద్మ నాయక్ వేధింపులకు భరించలేక బాధిత మహిళ యాదమ్మ (50 ) వాటర్ ట్యాంక్ ఎక్కి అందోళనకు దిగింది. 1983 లో ఏర్పడిన అగ్రికల్చర్ కాలని దాదాపు 35 సంవత్సరాలు... ఈ కాలనీ కి అధ్యక్షుడు గోపాల్ కృష్ణ రావు గా పని చేస్తు, రాములు అనే వ్యక్తిని సూపర్వైజర్ గా ఈ వెంచర్ లో నియమించుకున్నారు. ఈ వెంచర్ అన్ని పనులు చూసుకుంటు వుండేవారు. ఈ కాలనిలో జరుగుతున్న అవకతకలని అధ్యక్షుల వారికి వివరించి చెప్పడం వల్ల ఆ లేబర్ సూపర్వైజర్ రాములు గారిని 1989 లో హత్య చేశారని, ఈ నేపథ్యంలో కుటుంబ భారాన్ని, రాములు కొడుకు అయిన యాదయ్య సూపర్వైజర్ గా బాధ్యతలు నిర్వహించారు. అగ్రికల్చర్ కాలనీ లోని ప్లాటు నెంబరు 221 లో ఉంటూ 1983 నుంచి నేటి వరకు ఇక్కడ వాచ్ మన్ గా ఉంటూ పనులు చూసుకుంటున్నారు. తాము ఉంటున్న ప్లాటు స్థలంను గత రెండు సంవత్సరాలుగా తమకు చెందినదిగా జీహెచ్ఎంసీ వారు రోజు వేధిస్తున్నారని,
స్థానిక కార్పొరేటర్ పద్మ నాయక్, కాలనీ వాసి మహిపాల్ రెడ్డి గారి హస్తం వున్నదని, ఈ పూర్తి కక్షసాధింపు చర్యగ భావిస్తూ బాధిత కుటుంబానికి చెందిన మహిళా యాదమ్మ ఈ బాధలు భరించలేక అగ్రికల్చరల్ కాలని సేవరేజ్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేసిందని, మధ్యవర్తిత్వం వహించి బాధిత మహిళను వాటర్ ట్యాంక్ పై నుండి స్థానిక కాలనీ వాసులు దించారు. ఇప్పటికైనా బాధితురాలికి న్యాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

బైట్ : అమరేందర్ రెడ్డి (కాలనీవాసి) Body:TG_Hyd_64_14_Plot Andolana_AB_TS10012Conclusion:TG_Hyd_64_14_Plot Andolana_AB_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.