పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో గోరెంట్ల, పోలుమల్ల గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శ్మశానవాటికను పరిశీలించి.. ప్రకృతి వనాలపై ఆరా తీశారు. అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏవో, తదితర అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: 120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్