సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల(Tollywood Director Sekhar Kammula) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈనెల 21న సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో కప్పల లక్ష్మయ్య అనే రైతు గుడిసె కాలి దగ్ధమైంది. ఈ ఘటనలో అతడు బీరువాలో దాచుకున్న రూ.6 లక్షలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈటీవీ భారత్లో ప్రచురించిన కథనం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రైతుకు ఆర్థిక సాయం అందజేశారు.
లక్ష రూపాయలను నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు(Tollywood Director Sekhar Kammula) బదిలీ చేశారు. లక్ష్మయ్య కుటుంబంతో మాట్లాడిన శేఖర్.. భవిష్యత్లో వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. తమను ఆదుకున్న శేఖర్ కమ్ముల(Tollywood Director Sekhar Kammula)కు రైతు కుటుంబం కృతజ్ఞత తెలిపింది.
అసలేం జరిగిందంటే..
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య తన సోదరులతో కలిసి ఉమ్మడి వ్యవసాయ భూమి అమ్మగా తన వాటా పది లక్షల రూపాయలు వచ్చింది. దాంట్లో ఆరులక్షలు ఇంట్లోని బీరువాలో దాచిపెట్టాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుందామని లక్ష్మయ్య అనుకున్నాడు. దానికి సంబంధించి స్థలం, సామగ్రి, మేస్త్రీ ఇతర పనులన్ని దాదాపుగా పూర్తయ్యాయి. సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందని బేరీజు కూడా వేశాడు. కానీ.. ఇంట్లో వంట చేద్దామని గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలి(Gas Cylinder Blast) మంటలు వ్యాపించాయి. లక్ష్మయ్యది పూరిగుడిసె అవ్వడం వల్ల మంటలు త్వరగా వ్యాపించి గుడిసె దగ్ధమయింది. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. ఈ ఘటనలో లక్ష్మయ్య సొంతింటి కోసం దాచుకున్న రూ.6 లక్షల నగదు(cash burnt in suryapet) దగ్ధమయింది. వాటితోపాటే తన సొంతింటి కల కూడా బూడిదైపోయింది.