ETV Bharat / state

ఓ ముఖ్యమంత్రి ఊపిరిపోసిన విజ్ఞాన గనికి ఇప్పుడేమైంది? - library Dilapidation

ఎక్కడైనా గ్రంథాలయం మనకు విజ్ఞానాన్ని పంచుతుంది...కానీ ఇక్కడకు వెళ్తే దేశభక్తి పెరుగుతుంది. జాతీయోద్యమం కళ్లకు కడుతుంది. ఎంతోమంది నాయకుల జ్ఞాపకాలు మనల్ని పలకరిస్తాయి. ఆనాటి పత్రికలు మమ్మల్ని చదవమంటూ ఆహ్వానిస్తాయి. చారిత్రాత్మక బాపూజీ గ్రంథశాల విశేషాలివి. కానీ ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. పట్టించుకునే నాథుడే లేక.. ఆ బాపూ వచ్చి కాపాడాలని అర్థిస్తోంది!

dilapidation-library-at-chilukuru-in-suryapet-district
ఓ ముఖ్యమంత్రి ఊపిరిపోసిన విజ్ఞాన ఘనికి ఇప్పుడేమైంది?
author img

By

Published : Dec 11, 2019, 8:07 AM IST

Updated : Dec 11, 2019, 11:58 AM IST

ఓ ముఖ్యమంత్రి ఊపిరిపోసిన విజ్ఞాన ఘనికి ఇప్పుడేమైంది?

సూర్యాపేట జిల్లా చిలుకూరులోని బాపూజీ శాఖా గ్రంథాలయం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎంతో ఘనచరిత్ర ఉంది. 1941లో నాటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా రైతు గ్రంథాలయంగా ఏర్పడి 1972 ఏప్రిల్​ 16న హుజూర్​నగర్​ ఎమ్మెల్యే దొడ్డ నర్సయ్య చొరవతో ప్రభుత్వ గ్రంథాలయంగా మారింది.

తొలి తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ఒకరైన రావినారాయణరెడ్డి ఊపిరి పోసిన గ్రంథాలయం అది. 15వేల పుస్తకాలకు నిలయంగా... ఎంతో మందిని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దిన బాపూజీ గ్రంథాలయమది. ఆంధ్రమహాసభ సమయంలో పురుడు పోసుకున్న ఆ విజ్ఞాన ఘని నేడు శిథిలమవుతోంది!

15 వేల పుస్తకాలు...

ఈ గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 15వేలకు పైగా గ్రంథాలతో విరాజిల్లుతోంది. పాఠకులను మేధావులుగా తీర్చిదిద్దుతోంది. జాతీయోద్యమం, నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటం సాగుతున్న కాలంలో బాపూజీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 1959లో నాయిని అలివేలు మంగమ్మ తన స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో ఈ స్థలంలో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

హుజూర్​నగర్​ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య నాయకత్వంలో విరాళాలు సేకరించి 1972లో రైతు గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు.

నిత్యం 500 మందికి పైనే...

ప్రతిరోజూ 500 మందికి పైగా సందర్శించే ఈ గ్రంథాలయంలో పురాణాల దగ్గర నుంచి నేటి ఆధునిక సాంకేతిక వరకు వేల సంఖ్యలో పుస్తకాలు లభ్యమవుతున్నాయి. విద్యార్థులకు పాఠశాల పుస్తకాలలో లేని విషయాలను గ్రంథాలయంలో తెలుసుకోవడం జరుగుతుంది.

ఎన్నో పుస్తకాలకు నిలయం

గరుడ పురాణం, పల్నాటి కథలు, భారత రాజ్యాంగం, భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణా రైతాంగ పోరాటం, భగవద్గీత, శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్యులు, నారాయణరెడ్డి మొదలగు మేధావుల పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. మాస పత్రికలు, వారాంతపు పత్రికలు రోజువారి పత్రికలు ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. దొడ్డా నర్సయ్య జ్ఞాపకార్థం నూతనంగా రీడింగ్ హాలును నిర్మించారు. ఇదే గ్రంథాలయంలో చదువుకొని ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

ఎంతోమందిని మేధావులుగా తీర్చిదిద్దిన ఆ విజ్ఞాన భాండాగారం నేడు శిథిలావస్థకు చేరింది. ఓ ఉద్యమ నేత పేరుతో పురుడుపోసుకున్న, ఓ ముఖ్యమంత్రి స్వయంగా కితాబిచ్చిన ఆ గ్రంథాలయం నేడు 'గతం' కాబోతోంది. దానిని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్టే..!?

Intro:( )
తొలి తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ఒకరైన రావి నారాయణరెడ్డి ఊపిరి పోసిన గ్రంధాలయం అది....15వేల పుస్తకాలకు నిలయంగా, ఎంతోమందిని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దిన గ్రంధాలయం సూర్యాపేట జిల్లా చిలుకూరు బాపూజీ గ్రంధాలయం.చిలూకూరు లో ఎనిమిదవ ఆంధ్రమహాసభ సమయంలో పురుడు పోసుకున్న గ్రంధాలయం బాపూజీ గ్రంధాలయం.నేడు ఈ గ్రంధాలయం శిథిలావస్థ దశలో ఉంది.పాటించుకొనే నాధుడే లేరని గ్రామస్తులు అంటున్నారు.

VO...
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ శాఖా గ్రంధాలయం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎంతో ఘనచరిత్ర ఉంది. 1941లో నాటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత రావి నారాయణ రెడ్డి చేతుల మీదుగా రైతు గ్రంథాలయంగా ఏర్పడి 1972 ఏప్రిల్ 16న హుజుర్నగర్ ఎమ్మెల్యే దొడ్డ నర్సయ్య చొరవతో ప్రభుత్వ గ్రంథాలయంగ మారింది. ఈ గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 15 వేలకు పైగా గ్రంథాలతో విరాజిల్లుతూ పాఠకులను మేధావులుగా తయారుచేస్తుంది.. జాతీయోద్యమం,నైజాం వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటం సాగుతున్న కాలంలో బాపూజీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.. 1959లో నాయిని అలివేలు మంగమ్మ తన స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో ఈ స్థలంలో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.... హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య నాయకత్వంలో విరాళాలు సేకరించి 1972లో రైతు గ్రంథాలయాన్ని జిల్లా గ్రంధాలయంగ ఏర్పాటుచేశారు...

@@15000 పైగా గ్రంధాలు@@
ప్రతిరోజు 500 మందికి పైగా సందర్శించే ఈ గ్రంథాలయంలో పురాణాల దగ్గర నుండి నేటి ఆధునిక సాంకేతిక వరకు వేల సంఖ్యలో పుస్తకాలు లభ్యమవుతున్నాయి. విద్యార్థులకు పాఠశాల పుస్తకాలలో లేని విషయాలను గ్రంథాలయంలో తెలుసుకోవడం జరుగుతుంది.నిత్యం వందల సంఖ్యతో ఈ గ్రంధాలయం కళకళలాడుతోంది. గరుడ పురాణం,పల్నాటి కథలు, భారత రాజ్యాంగం, భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణా రైతాంగ పోరాటం, భగవద్గీత, శ్రీ శ్రీ,దాశరధి కృష్ణమాచార్యులు,సి నారాయణ రెడ్డి మొదలగు మేధావుల పుస్తకాలు ఈ గ్రంథాలయం సొంతం. మాస పత్రికలు,వారాంతపు,పత్రికలు రోజువారి పత్రికలు ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. దొడ్డా నర్సయ్య జ్ఞాపకార్థం నూతనంగా రీడింగ్ హాలును నిర్మించారు. ఇదే గ్రంథాలయంలో చదువుకొని ఎంతో మంది ఉన్నత శిఖరాలకు ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నారని నిర్వాహకులు అంటున్నారు...

@@శిథిలావస్థకు చేరిన భవనం@@
1972లో ఏర్పాటుచేసిన కొత్త భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది. 15 వేల పుస్తకాలకు ప్రమాదం ఏర్పడింది. గ్రంథాలయాల అభివృద్ధికి 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని పాలకులు ప్రకటించిన నేటికీ ఆచరణ లేకుండా పోయింది. పలుమార్లు జిల్లా పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని నిర్వాహకులు అంటున్నారు .. ఎప్పుడు కూలి పోతుందో తెలియని పరిస్థితులలో తక్షణమే నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని చిలుకూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ..Bytes

1బైట్::దొడ్డ నారాయణ::గ్రంధాలయం సభ్యుడు...

2బైట్:::మండవ వీరస్వామి:::గ్రంధాలయం అధికారి

3బైట్:::సాతులూరి గురువయ్య:::గ్రామస్థుడు.

4బైట్:::శోభ...విద్యార్థి

5బైట్::సత్యనారాయణ:::గ్రామస్థుడు..Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
Last Updated : Dec 11, 2019, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.