ETV Bharat / state

Farmers Problems: అన్నదాతల అరిగోసలు... కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని.. అమ్మేటప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ కేంద్రంలో చూసినా... ధాన్యం కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తోంది. కొన్ని చోట్ల కేంద్రాలు ఇంకా తెరవకపోగా... ప్రారంభించిన పలు చోట్ల కొనుగోళ్లు మొదలవలేదు. ఫలితంగా రైతులు... రోజుల తరబడి ధాన్యపు కుప్పలపైనే పడిగాపులు కాస్తున్నారు.

Farmer issues
Farmer issues
author img

By

Published : Nov 8, 2021, 9:57 PM IST

రోజులు గడుస్తున్నా అన్నదాతలకు ధాన్యం అమ్మకాల కష్టాలు తీరడం లేదు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో వ్యవసాయ మార్కెట్ల దగ్గర రైతులు నిరసనలు చేపట్టారు. తిండీతిప్పలు లేకుండా టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నా... తెలిసిన వారికే అధికారులు టోకెన్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని.. అమ్మేటప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. నూతనకల్ మండలం చిల్పకుంట్లలో రైతులు ఆందోళన చేపట్టారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోనూ వరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు.. ధాన్యం విక్రయాల కోసం ఎదురు చూస్తున్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ... పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసుకున్నారు. జిల్లాలో 351 కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలుపెట్టకపోవడంతో... కేంద్రాలు ధాన్యంతో నిండిపోయాయి.

ధాన్యం కుప్ప వద్దే రైతు ఆత్మహత్య..

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా కామారెడ్డి జిల్లా హన్మాజీపేటలో విషాదం నెలకొంది. ధాన్యం కుప్ప వద్దే శంకర్‌ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు రైతు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె వేడుకుంది.

కేంద్రం సహకరించకున్నా ఈ ఏడాది ధాన్యం కొంటాం..

కేంద్రం సహకరించకపోయినా ఈ ఏడాది ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగొద్దనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తీర్మాలయాపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వచ్చే యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. లాభసాటి వ్యవసాయంతో రైతులు నూతన ఒరవడిని తీసుకురావాలని కోరారు.

ఇదీ చదవండి: FARMER SUICIDE: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.