ETV Bharat / state

'అప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితి బాగుండేది' - సూర్యాపేటలో డీజీపీ పర్యటన

ఆదిలోనే జాగ్రత్తలు తీసుకుంటే సూర్యాపేట జిల్లాలో పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని కాదని రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం అభిప్రాయపడింది. అన్ని శాఖలు ముందు నుంచి సమన్వయంతో పనిచేస్తే తొలి రెండు మూడు కేసులు బయటకువచ్చినప్పుడే కరోనా కట్టడి అయ్యేదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సూర్యాపేట జిల్లాలో సీఎస్, డీజీపీ పర్యటించారు. మరోవైపు ముగ్గురు అధికారులపై వేటు పడటం సంచలనంగా మారింది.

cs and dgp visit to and review on corona
'అప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితి బాగుండేది'
author img

By

Published : Apr 23, 2020, 8:48 AM IST

సూర్యాపేటలో రాష్ట్ర అత్యున్నత స్థాయి బృందం పర్యటించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. జిల్లా అధికారులతో సమీక్షించారు. హెలికాప్టర్​లో సూర్యాపేటకు చేరుకున్న బృందం.. అత్యధిక కేసులు వెలుగుచూసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించింది. జరుగుతున్న పరిణామాల గురించి కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్​లో ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి ఈ స్థాయికి వచ్చేది కాదని... డీజీపీ మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తే కట్టడి సాధ్యమయ్యేదని వ్యాఖ్యానించారు. రెండు గంటల పాటు కలెక్టర్, ఎస్పీ, ఓఎస్డీతో సమావేశమైన రాష్ట్ర బృందం... అనంతరం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష చేపట్టింది. ప్రాథమిక కాంటాక్టులపై ఇప్పటికైనా దృష్టి సారించాలన్నారు. క్వారంటైన్​లో ఉన్నవారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సూర్యాపేట జిల్లాలో బుధవారం మరో మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 83కు చేరుకుంది. సూర్యాపేట పట్టణంలోనే 54 నమోదయ్యాయి. ఆత్మకూరు(ఎస్) మండలంలోని ఓ గ్రామంలో 15, తిరుమలగిరిలో 7, నాగారం మండలంలోని ఓ గ్రామంలో 6, నేరేడుచర్లలో ఒకరికి కరోనా పాజిటివ్​ వచ్చింది. జిల్లావ్యాప్తంగా 796 మంది నమూనాలు పంపగా... ఇంకా 8 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ కేంద్రాల్లో 187 మంది... హోం క్వారంటైన్లలో 4 వేల 382 మంది ఉన్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ధ్రువీకరించారు.

జిల్లాలో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు పడింది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నిరంజన్ స్థానంలో.. సాంబశివరావును నియమించారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంఛార్జిగా ఉన్న సాంబశివరావు... సూర్యాపేట జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ నాగేశ్వర్ రావును ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ... ఆయన స్థానంలో ఎస్.మోహన్ కుమార్​కు బాధ్యతలు అప్పగించారు. పట్టణ సీఐ శివశంకర్​ను కూడా బదిలీ చేశారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. 943కు చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.