సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నియోజకవర్గ స్థాయి రైతు మెగా రుణమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు. డీసీసీబీ ఈఓ జిల్లా డైరెక్టర్లు, పీఏసీఎస్ ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నీ పీఏసీఎస్ సెంటర్లకు రూ. 8 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఉన్న 16 సంఘాల్లో ఒక్కో సంఘానికి రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేశామని ఆయన తెలిపారు.
డీసీసీబీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక్కో సంఘానికి రూ.50 లక్షలు కేటాయించడం మొదటిసారి అని మహేందర్ రెడ్డి అన్నారు. నిత్యం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. రైతులకు రుణాలతో పాటు.. వ్యాపార సంబంధ రుణాలు కూడా ఇవ్వడానికి డీసీసీబీ నిర్ణయం తీసుకుందన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని సంఘాలకు అడిగినన్ని రుణాలు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు, జగదీశ్వర్ రెడ్డికి, ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలకు... ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం