సూర్యాపేట జిల్లాలో గుర్తించిన 6,479 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు తొలి విడుతలో టీకా ఇస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డితో కలిసి ప్రారంభించారు. తొలి టీకాను ప్రభుత్వ వైద్యుడు, జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు విద్యాసాగర్‌కు వేశారు.
జిల్లాలో 3 కేంద్రాల్లో టీకా వేశారు. సూర్యాపేట జనరల్ ఆస్పత్రి, జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా 10మంది వైద్య సిబ్బందికి టీకా వేసి అరగంట పాటు వారిని గమనించారు. అలా పరిశీలించిన తర్వాత మరో 80 మందికి టీకా వేశారు.
ఇదీ చదవండి: 'ఒక దేశం- రెండు వ్యాక్సిన్లు.. ఇదీ భారత్ సత్తా'